About MONDRU'S ENGLISH TRAINING TO INDIAN TRAINERS

Frame by Frame

Creative individuals thrive on being able to share their ideas and opinions with others around them. This YouTube channel has provided such a wonderful outlet to do exactly that. MONDRU'S ENGLISH TRAINING TO INDIAN TRAINERS is proud to provide you with colorful and engaging videos, curated just for you.


This site brings interesting and relevant content into your world, and there is truly something for everyone to enjoy. Keep exploring through the videos, and please reach out if you have any questions.

ముందు మాట

PREFACE / INTRODUCTION

         ఇంగ్లిష్ భాష మాట్లాడడము చాల సులభమం ! అది ఇప్పుడు ఇంకా సులభ తరమైనదని చెప్పగలను. ఆంధ్ర ప్రదేశ్ వారికైయితేనేమి, తెలంగాణవారికైతేనేమి ఇంగ్లిష్ మాట్లాడడము చాలా సులభము. ఎందుకంటే నా విధ్యా బోధన అంతా తెలుగు మీడియం లో జరిగిపోయిన నాకు ఇంగ్లిష్ మాట్లాడగలిగాను కాబట్టే మీరెవరైనా సరే ఇంగ్లిష్ మాట్లాడగలరన్న నమ్మకము హండ్రెడ్  పెర్సెంట్ (100%) నాకుంది. 1977వ సంవత్సరం నుండి 1987వ సంవత్సరం వరకు అంటే 10   సంవత్సరాలుగా పడిన పాట్లు ఇంతా అంతా కాదు. 40% English  మాట్లాడటానికి పది సంవత్సరములు పట్టింది. 1990వ సంవత్సరము నుండి 1992వ సంవత్సరము వరకు అంటే రెండు సంవత్సరములు ప్రాక్టికల్ గ గ్రామర్  బోధించి  గ్రమ్మెరియన్ అన్న  బిరుదును  పొందానని  చెప్పుటకు  అతిశయించుచున్నాను.  దేవుడు ఆ అనుభవములోనుండే ఎవరికీ దొరకని టాలెంట్ అనండి, గిఫ్ట్  లేదా స్కిల్ (skill) అనండి నాకు ఇచ్చాడు. అది  కాస్త  80% కు  చేరుకుంది.  నేను ఎలాంటి బాషా పొరపాట్లు(GRAMMATICAL మిస్టేక్స్) లేకుండా  తప్పు లేకుండా, కరెక్ట్ గ అనర్గళంగా మాట్లాడ గలుగు చున్నానన్న సర్టిఫికెట్ చాలా ఇన్స్టిట్యూట్స్ నుండి పొందానని చెప్పుటకు ఏమాత్రము సందేహించుట లేదు. నా క్లాస్సేస్ ఉదయం 6 గంటలకు ఆరంభమై రాత్రి 8  గంటలకు ముగించుకొని గాంధీ  బొమ్మ CENTER లోని GT  రోడ్ కు వెళ్లి 9  లేదా   9 .30 వరకు ఫ్రెండ్స్ తో గడిపి ఇంటికి చేరుకునేవాణ్ణి. ఆ రోజుల్లో ఎనిమిది నుండి పది ఇన్స్టిట్యూట్స్ లో పని చేసే వాణ్ణి. 1995వ సంవత్సరము  వరకు   “X, INTER AND DEGREE CLASSES తీసుకునేవాణ్ణి.” 1996వ సంవత్సరము లో  ఒక   స్టూడెంట్  నాదగ్గర  ఇంగ్లిష్ క్లాస్ కు వచ్చేవాడు. ఒకరోజు సర్,  ‘స్పోకెన్ ఇంగ్లిష్  క్లాస్ అటెండ్ అవ్వాలి  కాస్త  ముందుగా  వెళ్తాను,’ అన్నాడు. అప్పుడేందుకో నాకు ఒక ఆలోచన తట్టింది. స్పోకెన్ క్లాస్ కు వెళ్ళేవాడు ఇంగ్లిష్ క్లాస్ అటెండ్  అవ్వాల్సిన అవసరమేముంది అనుకున్నాను. వెంటనే స్పోకెన్ మటేరియల్ ను చూస్తాను ఇవ్వు అని అడిగి  ఇప్పించుకున్నాను. ఆ  బుక్  పైన  ప్రపంచములోనే  అధునాతన  మైన  ఈక్వషన్ మెథడ్ లో ఫార్ములా సిస్టం తో  బోధించే ఏకైక సంస్థ అని వ్రాసి ఉంది. ఆ తరువాత  ఆ  బుక్  పేజీలను ఇటు అటు తిప్పేసాను. స్పోకెన్ క్లాస్ అటెండ్  అయేవాడివి ఇంగ్లిష్ క్లాస్ అటెండ్ కావలసిన అవసరముందా అని అడిగి ఇంగ్లిష్  ఎంత  వరకు  మాట్లాడగలవు  అని  అంటే కోర్స్ అంత అయిపోయినతరువాత మాట్లాడతాను అని చెప్పాడు. అప్పుడు  నాకు  ఇంగ్లిష్  మాట్లాడడము  నేర్పించే  సెంటర్  పెడితే బాగుంటుందన్నమనసు కలిగింది. GRAMMAR మూడు రకాలుగా ఉందని చెప్పవచ్చు. మొదటిది  సిచుయేషనల్ (SITUATIONAL)  మెథడ్, రెండవది ఫంక్షనల్ (FUNCTIONAL) మెథడ్  లేక స్ట్రక్చురల్ (STRUCTURAL) మెథడ్ మరి మూడవది రిమీడియల్ (REMEDIAL) మెథడ్. అందులో మొదటిదైన సిచుయేషనల్ మెథడ్ ను ఇంగ్లిష్  గ్రామర్  క్లాస్ తో పాటు నేర్పించేవాడిని.  ఆ స్పోకెన్ సెంటర్ వారు రెండవ మెథడ్ అయిన స్ట్రక్చురల్ (STRUCTURAL) లేదా ఫంక్షనల్ (FUCTIONAL) పద్దతిలో టీచింగ్ చేస్తున్నారు. బాషా అనునది టీచింగ్ తో వచ్చేది కాదు, కేవలము మాట్లాడితేనే వస్తుంది. భిన్న మైన పద్దతిలో వెళ్లి సాధించాలంటే కష్టమైనదే.  నేను సహితం ఆ రోజుల్లో ఇస్తున్న థర్బీదు అంత ఖఠినమైనది కాదని చెప్పవచ్చు. ఉదాహరణకు: మాట్లాడక  ముందు మాట్లాడుతాడని ఇంగ్లిష్ లో 'స్పీక్స్' (SPEAKS) అని, మాట్లాడుచున్నప్పుడు మాట్లాడుచున్నాడని ఇంగ్లిష్ లో 'స్పీకింగ్' (SPEAKING) అని మాట్లాడడము అయిన తరువాత మాట్లాడాడని ఇంగ్లిష్ లో 'స్పోకన్' (SPOKEN) అని, తన సమయము దాటి ఇంకొకరి సమయములో కూడా మాట్లాడుచుంటే మాట్లాడుచునే ఉన్నాడని ఇంగ్లిష్ లో హ్యాజ్ బీన్ స్పీకింగ్ (HAS BEEN SPEAKING) అని నేర్పించే వాడిని. దానిలో కొంత ఇబ్బంది కలిగేది.


           సృక్చురల్ (STRUCTURAL / FUNCTIONAL) మెథడ్ చాలా టైం తీసుకుంటుంది. వన్ వర్డ్ తోనే సెంటెన్స్(SENTENCE) అవుతుందని, సెంటెన్స్ చేయుటకు సబ్జెక్టు + ప్రెడికేటే (SUBJECT + PREDICATE) అనే సింపుల్ స్ట్రక్చర్ తో ప్రారంభించాలని మరియు సజెక్టు అంటే ఏమిటో ప్రెడికేటే అంటే ఏమిటో వివరించితే  గాని అర్థమయేది కాదు. ఆలా ప్రతి సారి ప్రతి స్ట్రక్చర్ కు అంటే దాదాపు 600 నుండి 700 స్ట్రక్చర్స్ (STRUCTURES) నేర్పించాలంటే అసాధ్యమైన పని అని చెప్పవచ్చు. REMEDIAL GRAMMAR:  రిమీడియల్ గ్రామర్ అనునది భాష వచ్చిన  వారి  సంభాషణలో మరియు వ్రాతలో వచ్చే తప్పులను సరిచేయడానికి  నివారించే  పద్దతి అని చెప్పవచ్చు. ఎలా తప్పొప్పులను సరిచేసుకోవచ్చో దానినే రిమీడియల్ గ్రామర్ (REMEDIAL GRAMMAR) అని అంటారు. వాటిలో  నుండే  పుట్టిన ఒకే ఒక వినూతన మైన (LATEST) భిన్నమైన (EXCLUSIVE / PECULIAR / STRANGE / DIFFERENT) భాష పరిశోధనే విక్టర్స్ (MONDRUS) స్పోకన్ ఇంగ్లిష్ / స్పీకింగ్ కోర్స్ అని చెప్పవచ్చు. అందులో ఉపయోగించిన మెథడ్స్ గాని స్కిల్స్ గాని ఎక్కడే గాని ఏ ‘SPOKEN ENGLISH’ పుస్తకములో గాని ఇంతవరకు ఉపయోగించలేదని ఘంటా పదంగా చెప్పగలను. నా స్పీకింగ్ కోర్స్ మొదటి రోజు మొదటి గంట నుండే మాట్లాడడము నేర్పించును. కొన్ని రోజులు బైలింగ్వల్ (BILINGUAL) పద్దతిలో నేర్పించుకుంటూ రెండు మూడు వారాల తరువాత ఇంగ్లిష్ TO ఇంగ్లిష్ లోనే బోధన కాదు శిక్షణ (TRAINING) జరిగి పోతుంది. మూడు నెలలలోనే పూర్తిగా మాట్లాడగలరు. నేనెలా నేర్చు కున్నానో తెలుసుకోవాలంటే నా ఆటోగ్రాఫీ - స్వీయ  చరిత్ర  ను చదువండి,దాని వలన చాలా ప్రయోజన మున్నది.

చివరగా ఒక ఉదాహరణ ఇచ్చి ప్రాముఖ్యమైన భాగములోకి వెల్దాము. షాపింగ్ చేయాలంటే ఏమి కావాలి? డబ్బు కావాలి. ఎంత డబ్బుంటే అంత షాపింగ్ చేయవచ్చు! డబ్బు లేకపోతే షాపింగ్ ఎలా చేయాలేమో ఇంగ్లిష్ వొకాబులరీ అంటే పదాలు / పదజాలము లేకపోతే ఇంగ్లిష్ స్పీకింగ్ కూడా చేయలేమని తెలుసుకొనండి .

డబ్బు లేంది షాపింగ్ లేదు, ఇంగ్లిష్ పదాలు తెలియక పొతే స్పీకింగ్ లేదు !

                                                                                                                                                               VICTOR

                                                                                                                                                            (MONDRUS)

 
 

All The Details

The Full Story

MONDRU'S ENGLISH TRAINING TO INDIAN TRAINERS is proud to produce wonderful and engaging video content for all of you to enjoy. Here, you’ll be able to follow MONDRU'S ENGLISH TRAINING TO INDIAN TRAINERS, the creative process, and the creative journey.

Today, video content is one of today’s most challenging and exciting mediums. MONDRU'S ENGLISH TRAINING TO INDIAN TRAINERS is constantly on the lookout for new ways to express ideas, and is always thrilled to collaborate with other artists in the video community. Take a look around the site, and please don’t hesitate to send feedback or ask questions.

 

91+ 9000325956

108, first floor.Model Apartment Houses, Gayetri Estates, Kurnool town, ANDHRA PRADESH- INDIA.-518003

©2020 by MONDRU'S TRAINING TO INDIAN TRAINERS. Proudly created with Wix.com